టాలీవుడ్ లో ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ తో వరుస పెట్టి సినిమాలు చేసిన హీరోయిన్లలో సోనాల్ చౌహాన్ ముందు వరుసలో ఉంటుంది. ఆమె బాలయ్య పక్కన మూడు సినిమాల లో నటించింది. ఆ తర్వాత రాధిక ఆప్టే కూడా వరుసగా రెండు సినిమాలు చేసింది. ఇక తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణకు లక్కీ హీరోయిన్గా మారింది. ఆమె బాలకృష్ణతో మూడు సినిమాల లో నటించి తాను క్రేజ్ తెచ్చుకుంది. బాలయ్యతో అఖండ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించిన అమ్మడికి ఆ సినిమా హిట్ అయిన అనుకున్న స్థాయిలో ఆఫర్లు పెద్దగా రాలేదు. అయితే అఖండ సీక్వెల్లో మళ్ళీ ప్రగ్యానే హీరోయిన్గా ఎంపిక చేశారు. క్రేజీ సిక్వెల్ ల్లో నటించడం పట్ల ప్రగ్యా చాలా హ్యాపీగా ఉంది. అఖండ - అఖండ 2 నే కాదు .. సంక్రాంతి కి వచ్చిన డాకు మహారాజ్ సినిమాలను ప్రగ్య హీరోయిన్గా నటించింది. డాకూ మహారాజ్ ట్రైలర్ లో ప్రగ్య నిజంగానే ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది.
శ్రద్ధా శ్రీనాథ్ - ఊర్వసి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారని చాలామందికి తెలుసు .. అసలు ప్రగ్యా ఉన్నారు అన్న విషయం ఎవరికీ తెలియదు. ట్రైలర్లో ప్రగ్యా ని చూసిన ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. ఏది ఏమైనా బాలయ్యకు ఆమె లక్కీ హీరోయిన్ గా మారింది. అఖండలో ఇద్దరూ కలిసి నటించారు . . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అఖండ 2 సినిమాలోని ఆమె నటిస్తోంది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలో ను ఆమె ఉంది. బాలయ్య సినిమాల లో తప్ప ప్రగ్యాకి మిగిలిన ఆఫర్లు రావడం లేదు. బాలకృష్ణకు మాత్రం ఆమె పర్ఫెక్ట్ జోడి అనిపిస్తుంది.