తెలుగు చిత్రసీమలో అపజయం ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన పటాస్‎తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా అనిల్ రావిపూడి తన ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తూ రావడం చాలా విశేషం. ఇక ఈసారి సంక్రాతి పండగకు "సంక్రాంతికి వస్తున్నాం!" అనే టైటిల్ తో 3వ సారి వెంకటేష్ తో ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ మరోసారి ఎఫ్2, ఎఫ్3 మించిన ఫన్ ఇస్తాడని ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి సినిమాల పోటీ ఎక్కువున్నప్పటికీ అని రావిపూడి తన సినిమాపైనే ఎంతో నమ్మకంతో ఉన్నాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే, అనిల్ రావిపూడి తర్వాత సినిమా సాహు గారపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన డెవలప్ మెంట్లు గురించి తాజాగా చిరు ఇంట్లోనే చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే మెగాభిమానులు ఎన్నోరకాల ఊహాగానాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు.. కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానంటూ చెప్పుకు రావడం గమనార్హం. శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని మరోలా చూపించబోతున్నానంటూ చెప్పుకొచ్చాడు.

సంక్రాంతి సినిమా విడుదల తరువాత అనిల్ రావిపూడి ఆ సినిమాపైనే కసరత్తులు చేయనున్నాడు. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పని చేసిన రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇక ఆఖరిగా స్క్రిప్ట్ లాకయ్యాక చిరు క్యారెక్టరైజేషన్ గురించి బయటకి చెబుతానని, అంతవరకూ సస్పెన్స్ ఉండబోతోందని అంటున్నారు. కాబట్టి ఇంకొన్ని వారాలు దానికోసం వేచి చూడక తప్పదు. విశ్వంభర చివరి దశలో ఉండడంతో బాలన్స్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ వేసవిలో థియేటర్లకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: