భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ సినిమాలు చాలా ఉంటాయి. అయితే అందులో చాలా ఘోరమైన డిజాస్టర్ సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి పేరు చెపితేనే సినీ ప్రేక్షకులు బయపడి పోతూ ఉంటారు. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అతి పెద్ద డిజాస్టర్ .. ఇంకా చెప్పాలంటే ఓ సినిమా కు రు. 45 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆ సినిమా కు కేవలం 300 టిక్కెట్లు మాత్రమే తెగాయి. దీనిని బట్టే ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో తెలుస్తోంది. దీనిని బట్టి ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ల తో పాటు సినిమా తీసిన నిర్మాత లకు ఏ స్థాయిలో నష్టం వాటిల్లిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమా కొన్న వాళ్లు అందరూ ఏకంగా 99. 99 శాతం నష్టాలతో లబోదిబో మన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2023 లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. ఆ సినిమా పేరు ` ది లేడి కిల్లర్ `. ఈ సినిమా హీరో ఎవరో కాదు ... బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీకపూర్ పుత్రరత్నం అర్జున్ కపూర్ కథానాయకుడు. ఈ సినిమా లో భూమి పెడ్నేకర్ కథానాయిక. ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుదలైందో లేదో కూడా చాలా మందికి తెలియదు. అంతలా ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంది.
ఈ సినిమా దేశం అంతటా కేవలం 293 టిక్కెట్లను విక్రయించి మొదటి రోజు రూ. 38 వేలు మాత్రమే కలెక్షన్లు రాబట్టింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత దారుణమైన బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫైనల్ గ్రాస్ కేవలం దారుణాతి దారుణంగా 70 వేలు రూపాయలు సంపాదించింది. 3 నవంబర్ 2023న విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా కేవలం 12 షోలు మాత్రమే వేసారు.