అయితే పుష్ప రాజ్ అందరి అనుమానాలను తన రేంజ్ తో మాయం చేసాడు . అయితే ఇప్పుడు పుష్ప 2 కి ఆదనంగా మరో 20 నిమిషాలు ఆడ్ చేయడం కారణంగా 3 గంటల 40 నిమిషాల పెద్ద సినిమాగా మారిపోతుంది .. పుష్ప వన్ నిడివి కూడా ఒక నిమిషం తక్కువ మూడు గంటలు వచ్చింది . అయితే మన తెలుగు ప్రేక్షకులకు పెద్ద నిడివి ఉన్న సినిమాలు కొత్తవి కాదు .. 1977లో నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూరకర్ణ సినిమా రన్ టైం కూడా దాదాపు 3 గంటలకు 46 నిమిషాలు ఉంటుంది .. ఇక ఇప్పటివరకు ఇదే అత్యంత పొడవైన తెలుగు సినిమా .. ఇక ఇప్పుడు పుష్ప2 3 గంటల 40 నిమిషాల తో రెండో పొడవైన తెలుగు సినిమాగా నిలుస్తుంది. ఈ లిస్టులో 'లవకుశ' (3 గంటల 28 నిమిషాలు), 'పాండవ వనవాసం' (3 గంటల 18 నిమిషాలు), 'పాతాళ భైరవి' (3 గంటల 15 నిమిషాలు), 'అల్లూరి సీతారామరాజు' (3 గంటల 7 నిమిషాలు), 'నిజం' (3 గంటల 7 నిమిషాలు), 'మాయాబజార్' (3 గం. 4 నిమిషాలు), మిస్సమ్మ (3 గం.1 నిమిషం) చిత్రాలు కూడా ఉన్నాయి. అర్జున్ రెడ్డి, RRR, కల్కి 2898 AD, మహానటి, మను, ప్రస్థానం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల నిడివి కూడా మూడు గంటలకు పైగానే వుంది.
ఇక మన భారతదేశంలోని అత్యంత పొడవైన సినమా జాబితా చూసుకుంటే .. తవమై తవమిరుండు - తమిళ్(ఒరిజినల్ కట్ 4 గంటల 35 నిమిషాలు), LOC కార్గిల్ - హిందీ(4 గంటల 15 నిమిషాలు), మేరా నామ్ జోకర్ - హిందీ (4 గంటల 4 నిమిషాలు), సంగం - హిందీ(3 గం. 58 నిమిషాలు), లగాన్ - హిందీ( 3 గం. 44 నిమిషాలు) వంటి సినిమాలు ఉన్నాయి. తెలుగు నుంచి ''దాన వీర శూర కర్ణ'' సినిమా ఒక్కటే టాప్-10 లాంగెస్ట్ మూవీస్ లిస్టులో ఉండగా.. ఇప్పుడు "పుష్ప 2: ది రూల్" సినిమా ఆ జాబితాలో చేరిపోతోంది. పైన చెప్పుకున్న చిత్రాలన్నీ ఒక భాగంగా తెరకెక్కినవే. కానీ పుష్ప రెండు భాగాలుగా వచ్చింది. 2 పార్ట్స్ కలిపితే 'పుష్ప' మొత్తం కథ 7 గంటల 40 నిమిషాలు అవుతోంది.అయినా సినిమాల నిడివి ఇన్ని గంటలే ఉండాలనే రూల్ ఏమీ లేదు .. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా తీయవచ్చు .. మంచి ఇంట్రెస్ట్ అయిన కథ ఉండి కథనం ఎంగేజింగా అనిపిస్తే ప్రేక్షకులు ఎంతసేపైనా థియేటర్లో కూర్చుంటారు .. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఈ విషయంలో విజయం సాధించాయి . . ఇక పైన చెస్సుకున్న సినిమాలే దీనికి ఉదాహరణ .. అయితే ప్రస్తుత కాలంలో ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే మూడు గంటలకు పైగానే నిడివి ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయే పరిస్థితి వచ్చింది .. పుష్ప 2 సినిమా ఫైనల్ రన్ 3 గంటల 40 నిమిషాలుగా మారనుంది .. మరి రాబోయే రోజుల్లో తెలుగులో 4 గంటల పాటు కూర్చోబెట్టే సినిమాలు కూడా వస్తాయేమో చూడాలి ..