తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకుంది నిత్యామీనన్. తెలుగులో కూడా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే , సన్నాఫ్ సత్యమూర్తి , భీమ్లా నాయక్ , గీతా గోవిందం తదితర చిత్రాలలో నటించింది నిత్యామీనన్. ఇప్పటికీ అడప దడపా చిత్రాలలో నటిస్తూ ఉన్న ఈమె తమిళంలో మలయాళం లో కూడా పలు చిత్రాలను నటించి గుర్తింపు సంపాదించుకుంది. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. గత కొంతకాలంగా నిత్య మీనన్ వివాహం చేసుకోబోతోందని రూమర్స్ వినిపించాయి. ఈ విషయం పైన తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.



జయం రవి, నిత్యామీనన్ జంటగా డైరెక్టర్ కృతిక ఉదయినిది డైరెక్షన్లో వస్తున్న చిత్రం కదలిక్క నేరిమిల్లై సినిమా మ్యూజిక్ ని ఈ రోజున చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం గమనార్హం. ఈ వేడుకలో నిత్య మీనన్ మాట్లాడుతూ తన జీవితంలో ప్రేమించడానికి ఎక్కడ సమయం లేదని కూడా వెల్లడించింది. అయితే గత కొద్దిరోజులుగా నిత్యమీనన్ ఒక హీరోలతో ప్రేమాయణం నడుపుతోందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించడంతో ఈ రూమర్స్ కి ఇలా చెక్ పెట్టిందని చెప్పవచ్చు.


నిత్య మీన కుటుంబ విషయానికి వస్తే ఈమె కుటుంబం బెంగళూరులో స్థిరపడింది ఈమె కుటుంబం కూడా మలయాళీ కుటుంబం.. నిత్యమీనన్ ఎనిమిది సంవత్సరాల వయసులోనే హనుమాన్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించిందట.. ఒక మ్యాగజైన్ కవర్ మీద హీరో మోహన్ లాల్ ఈమె ఫోటోలు చూసి మలయాళ సినీ పరిశ్రమకు పరిచయం చేశారట ఆ సినిమాని ఆకాశ గోపురం .. ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలో నిత్యమీనన్ అధిక బరువు పెరగడం వల్ల చాలా మంది ఈమెను ట్రోల్ చేయడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా తన సెలెక్టివ్ పాత్రలతో ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: