అలాగే ప్రభాస్ .. అర్జున్ రెడ్డి , యనిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసింది .. ఇక ఈ సినిమా లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయం పై చాలా వార్తాలు బయటికి వస్తున్నాయి .. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుందట. ప్రభాస్ - అనుష్క కాంబినేషన్ అంటేనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే విషయం తెలిసిందే ..
అందుకే ఈ కాంబోపై ఎప్పుడూ మంచి అంచనాలు ఉంటాయి . ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ను సందీప్ రెడ్డి వంగ అనుష్కకు వినిపించగా ఆమె ఈ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారట .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను త్వరలోనే మొదలు పెట్టనట్టు తెలుస్తుంది .. 'స్పిరిట్స మూవీని భూషన్ కుమార్ నిర్మించనున్నాడు . ఈ సినిమా ఈ ఏడాది మధ్యలో ప్రారంభమయ్యే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద చాలా సంవత్సరాల తర్వాత మరోసారి ప్రభాస్, అనుష్క కలవడానికి ముహూర్తం త్వరలోనే ఫిక్స్ అవ్వబోతోంది.