డార్లింగ్ ప్రభాస్ గురించి జనాలకు ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ నిజమైన బాహుబలి అనిపించుకోవడమే కాదు, యావత్ తెలుగు సినిమా పరిశ్రమను సైతం దేశంలోనే చాలా బలమైన సినిమా పరిశ్రమగా మలిచాడు. దానికి మూలకారణం దర్శక ధీరుడు రాజమౌళి అని అందరికీ తెలిసిందే. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సత్తాచాటుతున్నాడు.

ఈ క్రమంలోనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్" అనే సినిమాని చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిననాటినుండి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం జనాలను ఊరిస్తూనే ఉంది. ‘రాజా సాబ్’ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ రోజురోజుకీ వస్తున్న అప్డేట్స్ అయితే రెబల్ ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే మరోవైపు దర్శకుడు మారుతి ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరోను కూడా హ్యాండిల్ చేయలేని కారణంగా అభిమానులకు ఎక్కడో ఒక మూలన ఒకింత అనుమానంగా ఉంది. దాంతో ముందుగా ఒక గ్లింప్స్ విడుదల చేసి మారుతి అందరి నోళ్లు మూయించాడు మారుతి.

ఈ నేపథ్యంలో ‘రాజా సాబ్’పై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా తమన్ ఇచ్చిన క్రేజీ అప్డేట్ కూడా ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది. మారుతి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’కు తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. ఈ మూవీలోని ప్రతీ పాటకు సంబంధించిన అప్డేట్‌ను అందించాడు. ఇక జపాన్‌లో ప్రభాస్ పేరు చెప్తే గుర్తుపట్టనివారు ఉండరనే చెప్పుకోవాలి. అందుకే జపాన్‌లోనే ‘రాజా సాబ్’ ఆడియో లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు తమన్. అంతే కాకుండా అక్కడి ఫ్యాన్స్ కోసం జపానీస్ వర్షన్‌లో ఒక పాట కూడా కంపోజ్ చేస్తున్నట్టు బయట పెట్టాడు. అంతే కాకుండా ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉంటాయో కూడా చెప్పుకొచ్చాడు. దాంతో రెబల్స్  ఈ సినిమాపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: