టాక్సిక్ గ్లింప్స్ విషయానికి వస్తే.. యష్ రెట్రో కార్లో చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చినట్లుగా చూపించారు.అలాగే మరొకవైపు క్లబ్బులో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక అమ్మాయితో యష్ రొమాన్స్ చేస్తూ తన చేతిలో ఉన్నటువంటి వైన్ బాటిల్ ను ఆ మహిళ పైన పోస్తూ చూపించారు. ఇంతటితో టాక్సిక్ గ్లింప్స్ పూర్తి కావడం జరుగుతుంది. ఇక మేకింగ్ చూస్తూ ఉంటే రెట్రో స్టోరీలా ఈ సినిమా కనిపిస్తోంది. ఇందులో చాలా స్టైలిష్ లో హీరో యశ్ కనిపిస్తూ ఉన్నారు.
ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ ద్వారా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా ఎవరనే విషయం పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే నయనతార , కీయారా,కరీనాకపూర్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసే విధంగా చిత్ర బృందం భావిస్తోంది.ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. హీరో యష్ ప్రస్తుతం బాలీవుడ్లో రామాయన్ అనే సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు.. ఇప్పటికే యష్ నటిస్తున్న సినిమాలన్నిటి పైన కూడా భారీ బజ్ ఏర్పడింది. మరి ఏ మేరకు చిత్రాలతో అభిమానులను మెప్పిస్తారో చూడాలి.