పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ విషయంలో ఇప్పటికీ ఇంకా ఓ క్లారిటీ రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ మీద యూనిట్ అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. అందుకే తమన్, అజనీష్, శ్యామ్ సీఎస్ వంటి వారు వచ్చి పుష్ప 2కి ఆర్ఆర్ సెట్ చేశారు. ఈ విషయాలన్నీ తమన్ చెప్పాడు. ఓ వాట్సప్ గ్రూపు పెట్టుకుని, అంతా కలిసి ఆర్ఆర్ ఇచ్చామని అన్నాడు. కానీ చివరకు తమన్ చేసిన వర్క్‌ని పక్కన పెట్టారు. తమన్‌కు అసలు క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు. తమన్ ఇచ్చిన ఆర్ఆర్‌ను ఎక్కడా వాడుకోలేదట.టైటిల్స్‌లో శ్యామ్ సీఎస్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి క్రెడిట్స్ ఇచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్‌కు మ్యూజిక్‌కు, ఆర్ఆర్‌కు క్రెడిట్స్ ఇచ్చారు. అయితే ఏ సీన్‌కు ఎవరు ఆర్ఆర్ ఇచ్చారు అన్నది మాత్రం ఇంత వరకు టీం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చాలా మంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చాడని అన్నారు. క్లైమాక్స్ కూడా దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చాడని అన్నారు. కానీ శ్యామ్ సీఎస్ మాత్రం తాను ఇచ్చిన అవుట్ పుట్‌నే ఎక్కువగా వాడారు అని చెప్పుకొస్తుంటాడు.

అందుకే శ్యామ్ తాను చేసిన పని అందరికీ తెలియాలని ఓ వీడియోని వదిలాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేశాడు. లాస్ట్ మంత్ ఇదే డేట్, ఇదే టైంకి ఇలా పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.క్లైమాక్స్ సీన్‌కు ఎవరు కొట్టారు? జాతర ఎపిసోడ్‌కు ఎవరు ఇచ్చారు అంటూ ఇలా చాలా మంది చర్చించుకుంటున్నారు. అసలు పుష్ప 2 బీజీఎం మీద ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్‌ పై తమన్ స్పందిస్తూ సినిమా రిలీజ్ కు తక్కువ సమయం ఉండటంతో బి జి యమ్ ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు తెలిపారు.కాగా సినిమాలో సామ్ సి అందించిన బిజియం ను తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: