"గేమ్ చేంజర్".. మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఇప్పటికి థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది . మరి ముఖ్యంగా గేమ్ చేంజర్ తో పుష్ప2 రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాడు రామ్ చరణ్ అంటూ ఓ రేంజ్ లో బాగా మాట్లాడుకుంటున్నారు మెగా అభిమానులు. అయితే "గేమ్ చేంజర్" కి అంత సీన్ లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మొదటిగా డైరెక్టర్ శంకర్ ..రామ్ చరణ్ తో కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలి అంటూ ఆశపడ్డారట .
జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథలో నటిస్తే ఖచ్చితంగా బాగా క్లిక్ అవుతుంది అంటూ అనుకున్నారట. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేశారట . కథలో కొన్ని పొలిటికల్ యాంగిల్స్ ఉండడమే అందుకు కారణం అంటూ కూడా ఓ విషయం బయటకు వచ్చింది. పొలిటికల్ పరంగా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండేందుకు తారక్ ఈ కథను రిజెక్ట్ చేసారట . ఒకవేళ తారకే ఈ సినిమాను ఒప్పుకొని ఉంటే మాత్రం నిజంగా అది ఒక సెన్సేషన్ అయి ఉండేది . తారక్ ని ఎప్పటినుంచో పొలిటికల్ లీడర్ గా చూడాలి అనుకుంటున్నారు జనాలు. కానీ అది ఏ సినిమాలోనూ కుదరడం లేదు . ఫ్యూచర్ లోనైనా ఆ కోరిక నెరవేరుతుందేమో చూద్దాం..???