కోలీవుడ్‌లో టాప్ హీరోలు మంచి ఫాంలో ఉన్న టైంలో శివ కార్తికేయన్ నెమ్మదిగా ఎదిగాడు. బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుంటూ, హోస్టింగ్ చేసుకుంటూ మెల్లిగా హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. కామెడీ, ఎంటర్టైన్మెంట్‌ను తన బలంగా మార్చుకున్నాడు. మినిమం గ్యారెంటీ, నవ్విస్తాడు.. డ్యాన్సులు వేస్తాడు.. యాక్టింగ్ చేస్తాడు అనిపించుకుంటూ చిన్నగా హిట్లు కూడా కొట్టడం మొదలు పెట్టాడు. రెమో, సీమరాజా అంటూ మంచి హిట్లు కొట్టేశాడు. డాన్, డాక్టర్ అంటూ ఇండస్ట్రీని షేక్ చేశాడు.ఇక ఇప్పుడు అమరన్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. విక్రమ్, సూర్య, కార్తీ వంటి వారు కూడా చూడని కలెక్షన్లను చూపించాడు. అమరన్ మూవీ 300 కోట్లకు పైగా కొల్లగొట్టి కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ ఇమేజ్‌ను పెంచేసింది. అయితే తాజాగా శివ కార్తికేయన్ తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పాడు. ఈ ఇండస్ట్రీ ఎలా తనను ఆహ్వానించింది.. అవమానించిందో వివరించాడు.ఇండస్ట్రీలోకి ఓ కొత్త వ్యక్తి వచ్చి ఎదిగితే.. కొంత మంది బాగానే వెల్కమ్ చేస్తారు.. కానీ కొంత మంది మాత్రం సహించలేరు.. అంత ఎంకరేజ్ చేయరు.. వెల్కమ్ చెప్పరు.. ఎవడ్రా వీడు అని అనుకుంటారు. కొంత మంది అయితే నా మొహం మీదే అన్నారు.. ఎవడ్రా నువ్వు.. నీకు ఇక్కడేం పని అన్నారు.. కానీ అలా అన్నా కూడా నేను వారిని చూసి నవ్వుకుని అలా సైలెంట్‌గా వెళ్లేవాడ్ని అని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ఒకానొక సందర్భం లో తాను సినిమాలు మానేద్దామని అనుకున్నట్లు తెలిపారు.అలాంటప్పుడు ఏమిలేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు. అజిత్, విక్రమ్ లాంటి వారు బాక్గ్రౌండ్ లేకుండానే ఎదిగారు అంటూ తన భార్య మోటివేట్ చేయడం తో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపారు. ఇండస్ట్రీ లో నీలాదొక్కుకోవడం చాలా కష్టమని, యాంకర్ స్థాయి నుంచి యాక్టర్ గా ఎదిగిన నన్ను చాలా మంది అవమానించారని, నా విజయమే వారికీ సమాధానం అని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.అలాగే నా సినిమా సక్సెస్ అయినా కూడా నాకు మాత్రం క్రెడిట్స్ ఇవ్వరు.. మిగిలిన వారందరికీ క్రెడిట్స్ ఇస్తారు.. ఫెయిల్ మాత్రమే ఓ గ్రూపుగా అందరూ నన్ను టార్గెట్ చేస్తారు అంటూ శివ కార్తికేయన్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: