ప్రముఖ నటి హనీ రోజ్‌ పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు.హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్‌ కూడా చేశారు.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.కాగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నాడంటూ బాబీ చెమ్మన్నూర్‌పై హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగానే పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొచ్చి నుంచి వయనాడ్ వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అతనిని అదుపులోకి తీసుకుంది. తదుపరి విచారణ కోసం బాబీ చెమ్మన్నూర్‌ను కొచ్చికి తీసుకెళ్లనున్నారు. గత కొంత కాలంగా కొందరు తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నట్లు హనీ రోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

అలాంటి వారిపై చట్టపరంగా పోరాడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇప్పుడు హనీ రోజ్ ఆరోపణలతో మరోసారి లైంగిక వేధింపులు వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే బాబీ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిని ఉద్దేశించలేదని, హనీరోజ్ తన మాటలను తప్పుగా అర్థం చేసుకుందన్నాడు.భారతదేశంలోని ప్రముఖ బంగారు వ్యాపారులలో బాబీ చెమనూరు ఒకరు. గతంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ డిగో మారడోనాను కొచ్చికి తీసుకొచ్చి తన జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రముఖ వ్యాపారినే హనీ రోజ్ పై అసభ్యకర కామెంట్స్ చేసి వార్తల్లో కెక్కాడు.కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్‌ పేరు టాలీవుడ్‌ లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా 2014చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్‌ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్‌ అనే ప్రాజెక్ట్‌ ఉంది. ఇందులో హనీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: