మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కియార అద్వానీ నటించింది. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని , కొత్త రికార్డులను నమోదు చేస్తుంది అని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ ముందు మొదటి రోజు ఎలాంటి సవాళ్లు ఉన్నాయి. ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తే ఈ మూవీ ఏ స్థానంలో నిలుస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంది. ఈ మూవీ మొదటి రోజు 74.11 కోట్ల కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 70.81 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక దేవర మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.65 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , సలార్ మూవీ 50.49 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. మరి గేమ్ చేంజర్ మూవీ ఈ నాలుగు సినిమాల్లో ఏదైనా ఒక మూవీ కలెక్షన్లను క్రాస్ చేసి చేసి టాప్ 4 లో నిలుస్తుంది అని మెగా అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లేస్ లో నిలుస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: