బాలకృష్ణ, బాబీ కాంబోలో రూపొందిన 'డాకు మహారాజ్‌' సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి బ్యాక్‌ టు బ్యాక్‌ పాటలు వచ్చి సినిమా గురించి మరింత చర్చ జరిగేలా చేశాయి.హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా క‌నిపించ‌బోతున్నారు.తమన్ సంతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య లు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం 2025 జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్రమంలో యూఎస్ఏ లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పెమ్మసాని చంద్రశేఖర్ బాలయ్యకు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ మీసంలో తెలుగు వారి రాజసం, మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్తసముద్రాలు దాటుకొని డాలస్ వచ్చిన డాకుమహారాజ్ కు స్వాగతమన్నారు. అభిమానులు పెరిగేకొద్దీ అందం, ఏజ్ పెరిగేకొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నారు.

అలాగే బాలయ్య అంటే వైబ్రేషన్ అన్నారు.ఇదిలావుండగా సినిమా విషయానికొస్తే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య,ప్రగ్యా జైస్వాల్, చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు . వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని అభిమానులు  భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: