తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో మంచి విజయాలతో కెరియర్ ను మంచి స్థాయిలో ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా విశ్వక్ సేన్ "మెకానిక్ రాఖీ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి ఈ సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఎంత నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.65 కోట్ల షేర్ , 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 65 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4.30 కోట్ల షేర్ ... 8.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ దాదాపు 9 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి దాదాపుగా 4.70 కోట్ల రేంజ్ లో లాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ భారీ నష్టాలతో భారీ అపజయాన్ని అందుకున్నట్లు సమాచారం. ఈ మూవీ లో విశ్వక్ మెకానిక్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మీనాక్షి తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీ నాథ్ ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs