2000 సంవత్సరంలో యాశ్ పలు సీరియల్స్ ద్వారా మొదట చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టాడు .. ఆ తర్వాత వెండితెర పై ‘మొగ్గిన మనసు’, ‘కిరాతక’, ‘రజులి’ వంటి పలు సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు .. ఇక కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు .. యాశ్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసిందిది. ఇలా పాన్ ఇండియా హీరోగా భారీ క్రెజ్ తెచ్చుకున్న యాశ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కొన్ని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు .. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారాను భారీగా సంపాదిస్తున్నాడు .. ఇక దీంతో భారీగానే ఆస్తులు కూడ పెట్టాడు ఈ రాఖీ భాయ్ .. ప్రతి సంవత్సరం అందుతున్న ఓ నివేదిక ప్రకారం ఏట 60 నుంచి 70 కోట్లు సంపాదిస్తున్నాడు యాశ్ ..
ఇలా ఇప్పటివరకు ఈ స్టార్ హీరో మొత్తం సుమారు 253 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది .. అలాగే యాశ్ పలు బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తాడు ఇందుకోసం కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.. అలాగే రామాయణం’ సినిమాకు గాను యశ్ 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. దీంతో భారతీయ సినిమా చరిత్రలో ఖరీదైన విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు రాఖీ భాయ్. అయితే ఈ చిత్రానికి యశ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు టాక్. రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడని తెలుస్తోంది. యశ్ కు గోల్ఫ్ రోడ్డు సమీపంలోని ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో రూ. 4 కోట్ల విలువైన ఇల్లు ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో దీనిని అందంగా అలంకరించాడు. ఇక యశ్ గ్యారేజ్ లో రేంజ్ రోవర్ కారు ఉంది.