బడాబడా సూపర్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా యంగ్ బ్యూటీస్ చేయలేని సాహసాలు కూడా చేసి శభాష్ అనిపించుకుంది . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. మీకోసం ఒక హింట్ కూడా ఇస్తాను.. రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే వారెవ్వా అనే రేంజ్ లో ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. 40 ప్లస్ వచ్చిన ఇంకా పెళ్లి ప్రస్తావని మాత్రం తీసుకురావడం లేదు . ఈ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టేసే ఉంటారు . ఎస్ మీలో చాలామంది గెస్ చేసినట్లే ఈ బ్యూటీ త్రిష .
"నీ మనసు నాకు తెలుసు" అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష.. ఫస్ట్ సినిమాలో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంది . ఆ తర్వాత సినిమా సినిమాకి తన లెవెల్ తన అందం ఏ రేంజ్ లో పెంచేసుకుందో అందరికీ తెలుసు . పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇప్పుడు తెలుగు తమిళం లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ త్రిష చిన్నప్పటికి ఫోటో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా బబ్లీగా ముద్దుగా ఉండిందో పెద్దయ్యాక అంతే అందంగా ఉంది . ఇప్పుడు త్రిషని చూసిన సరే అందరూ ఏ 18 , 22 అనుకుంటారో తప్పిస్తే 40 ప్లస్ అని ఎవరు కూడా అనుకోరు. అంతలా తన ఫిజిక్ ని తన అందాన్ని కత్తిలా మెయింటైన్ చేస్తుంది త్రిష..!