ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్ల గురించి డైరెక్టర్ల గురించి నిర్మాతల గురించి షాకింగ్ కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారు ఒకప్పటి డైరెక్టర్ గీతా కృష్ణ. ఇప్పటికే చాలామంది హీరోయిన్లపై,హీరోలపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఈయన ఈసారి చిరంజీవిని టార్గెట్ చేశారు.ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ఎలాంటివారంటే ఆయనతో పని చేసిన డైరెక్టర్లు ఎవరైనా హిట్లిస్తే ఇంటికి పిలిచి మరీ మర్యాదలు చేస్తాడు. ఒకవేళ హిట్టు లేకపోతే కనీసం కలవడానికి ఇంటికి వెళ్తే లోపలికి కూడా పిలవడు. చేతుల దాకా వచ్చిన కాఫీని కూడా చేతిలోకి ఇవ్వనివ్వడు. 

కేవలం ఆయన తో సినిమాలు చేసే డైరెక్టర్లు మాత్రమే కాదు వేరే డైరెక్టర్లు కూడా హిట్ సినిమాలు తీస్తే ఇంటికి పిలిచి మరి శాలువాతో సన్మానం చేసి కాకా పడతాడు. ఆ డైరెక్టర్ హిట్ కొడితే మళ్ళీ ఈయన ను వేరే సినిమా కోసం తీసుకుంటాడని అలా చేస్తాడు. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉంటే మాత్రం కనీసం వారిని పలకరించడు.. అంటూ చిరంజీవి నిజ స్వరూపం బయట పెట్టారు గీతా కృష్ణ.కేవలం చిరంజీవి మాత్రమే కాదు నిర్మాత అల్లు అరవింద్ కూడా అలాంటి వారేనని, చిరంజీవి ఈ అలవాటు తన బావమరిది అల్లు అరవింద్ దగ్గర చూసే నేర్చుకున్నారంటూ మాట్లాడారు.

 అంతేకాకుండా అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు ఒకటే.. వాళ్ళిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు.. కానీ పిల్లలు పెద్దయ్యాక పిల్లల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా వీరి మధ్య దూరం పెరిగింది.కానీ ఎప్పటికీ వీరిద్దరూ ఒక్కటే. చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగింది అల్లు ఫ్యామిలీ వల్ల..అలాగే అల్లు అరవింద్ నిర్మాతగా ఎదిగింది చిరంజీవి సినిమాల వల్ల..  వీరిద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అంటూ గీతా కృష్ణ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: