హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ మహేష్ చందు దర్శకత్వంలో BSS -11 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇందులో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు చిత్ర బృందం. వాటి గురించి చూద్దాం.


హైందవ సినిమా టైటిల్ గా చిత్ర బృందం ప్రకటించింది.. ఈ గ్లింప్స్ చేస్తూ ఉంటే ఏదో మైథాలజికల్ త్రిల్లర్ సినిమాగా కనిపిస్తోంది.. ఇందులో కొంతమంది దుండగులు గుడి చుట్టూ ఆవరణంలో గుడిని తగలబెట్టాలని చూస్తుంటే హీరో శ్రీనివాస్ తో పాటుగా ఒక వరాహం, సింహం వచ్చి కాపాడినట్టుగా చూపించడం జరిగింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుమూర్తి దశావతారాలుగా చూపించారు. ఈ సినిమా కూడా ఏదో మిస్టరీ సినిమాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. గ్లింప్స్ షార్ట్స్ కూడా ఇందులో అదిరిపోయేలా కనిపిస్తున్నాయి.


హైందవ సినిమాని పాన్ ఇండియా లేవల్లోనే రిలీజ్ చేయబోతున్నారు చిత్రబృందం. గతంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్  తెలుగులో అయితే 2021లో అల్లుడు అదుర్స్ సినిమాతో అలరించారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్లో చత్రపతి సినిమాని రీమిక్స్ చేసినప్పటికీ ఇది ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు చేయరని సందేహం కూడా మొదలయ్యింది. అందుకే సరికొత్త కదా అంశాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో రాబోతున్నారు అలాగే మరొక సినిమా భైరవంలో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నారా రోహిత్, మనోజ్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. మొత్తానికి హైందవ సినిమా గ్లింప్స్ మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: