ఈ నేపథ్యంలోనే.... ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మీనాక్షి చౌదరి. ఇటీవల లక్కీ భాస్కర్ తో బంపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ... ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటూ సందడి చేస్తోంది. విక్టరీ వెంకటేష్ ప్రియురాలిగా ఈ సినిమాలో నటించబోతుంది మీనాక్షి చౌదరి. అలాగే స్పెషల్ పోలీస్ పాత్రలో కూడా కనిపించనుంది. అంతేకాదు విక్టరీ వెంకటేష్ ప్రియురాలిగా ఈ సినిమాలో సందడి చేయనుందట.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. గోట్ సినిమా కారణంగా తాను ట్రోలింగు కు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ది గోట్ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి... హీరో విజయ్ సరసన నటించిన సంగతి తెలిసిందే. కుమారుడి పాత్రలో హీరో విజయ్ ఈ సినిమాలో సందడి చేయగా అతనికి... హీరోయిన్ గా మీనాక్షి చౌదరి చేయడం జరిగింది.
అయితే ది గోట్ సినిమాలో నటించినందుకు గాను ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేశారట కొంతమంది. దీంతో ఆ సమయంలో డిప్రెషన్ కు వెళ్ళినట్లు తెలిపింది. కానీ అదే సమయంలో లక్కీ భాస్కర్... సినిమాలో ఛాన్స్ కొట్టేసి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలిపింది. దాంతో ఆ డిప్రేషన్ లో నుంచి... బయటికి వచ్చినట్లు హీరోయిన్ మీనాక్షి చౌదరి వెల్లడించారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సందడి చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.