సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా పుష్ప సినిమా కామెంట్స్ పై స్పందించారు. ఇటీవల ఆయన హరికథ వెబ్‌ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పుష్ప సినిమాపై కామెంట్స్ చేశారు. ఆ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మనమంతా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశామని అన్నారు. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారని తెలిపారు. నిన్నగాక మొన్న వాడెవడో ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడని చెపుకొచ్చారు. ఈరోజుల్లో అసలు హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయని ఆయన చెప్పారు.
అయితే ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆయన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఆయన షష్టిపూర్తి అనే మూవీ ప్రెస్‌ మీట్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇటీవల నేను అల్లు అర్జున్‌ను కలిశాను. మేమిద్దరం కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నాము. సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి ఇద్దరం నవ్వుకున్నాము కూడా. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్‌గా చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తాము' అని నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇక ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: