నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్ .. బాలకృష్ణ 109 వ సినిమా గా దర్శకుడు బాబి తెర్కక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా , ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ గా కనిపించబోతున్నాడు .. సంక్రాంతి కానుక గా ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఈ క్రమం లోనే తాజాగా ఈ మూవీ టీం ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసింది .. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది .
ఇక ట్రైలర్ తర్వాత సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి .. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తుండ గా మేకర్స్ అంతకుమించి హైప్ న్ని పెంచుతున్నారు .. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సినిమా ఆటోగ్రఫీ అందించిన ప్రముఖ చాయాగ్రాహకులు విజయ్ కార్తీక్ కన్నన్ ఒక పర్టికులర్ సన్నివేశం నుంచి ఓ ఫ్రేమ్ పెట్టి ఆ సీన్ కి తమన్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది సిద్ధంగా ఉండండి అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు .. ఇక మరి ఆ ఫ్రేమ్లో బాలయ్య లుక్ ఎంతో పవర్ఫుల్ యాంగ్రీ గా కనిపిస్తుండ గా ఊర మాస్ ఉచ్చ కోత జరిగినట్టు గా కనిపిస్తుంది .. ఇక మరి డాకు మహారాజు లో బాలయ్య విద్వాంసం ఎలా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు అగాల్సిందే .
— bobby (@dirbobby) January 8, 2025 ">
— bobby (@dirbobby) January 8, 2025