బింబిసారా సినిమాతో డైరెక్టర్ గా మొదటి విజయం అందుకున్నాడు వశిష్ట అలియాస్ వేణు మాల్లిడి .. అల్లు అర్జున్ తో బన్నీ, రవితేజ తో భగీరథ, మంచు విష్ణు - శ్రీనువైట్ల కాంబినేషన్లో ఢీ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడే ఈ వేణు .. అయితే ముందుగా వేణు హీరోగా ప్రేమలేఖ రాశా అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు . ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు కానీ నటుడుగా వర్కౌట్ కాకపోవటంతో కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయాడు . అయితే నిజానికి అతను పట్టు వదలని విక్రమార్కుడిలా చిత్ర పరిశ్రమలోనే ఉన్నాడు కొన్నాళ్లపాటు రీసెర్చ్ చేసి ఈసారి డైరెక్టర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు .
అలా దర్శకుడిగా ఆయన చేసిన బింబిసారా సినిమా మంచి హిట్ కావడంతో .. ఊహించిని విధంగా ఆయన దశ మారిపోయింది .. ఇక ఆ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తాడా .. అని అందరూ ఎదురు చూశారు .. అయితే డైరెక్టర్గా ఎవరు ఊహించిని విధంగా రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవి తో చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు .. విశ్వంభర పేరుతో ఒక సోషియో ఫాంటసీ డ్రామా మూవీ తెరకెక్కిస్తున్నాడు .. ఒకరకంగా ఆయన లైన్ అప్లో ఇది అతి పెద్ద అరుదైన అచీవ్మెంట్ గా భావిస్తున్నట్టు పలు ఇంటర్వ్యూలో వశిష్ట చెప్పుకొచ్చారు .. ఇక ఈ సినిమా సంక్రాంతికి రావాలి కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం చిరంజీవి కాస్త వెనక్కి వెళ్లారు .. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.