ఈమె మొదటగా అదుర్స్ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. ఇప్పుడు తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించుకుంది. అలాగే శ్రీముఖి కొన్ని చిత్రాల్లో కూడా నటించింది. అయితే తాజాగా శ్రీముఖి క్షమాపణలు చెప్పారు.
ఇటీవల శ్రీముఖి సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో యాంకర్ గా చేసింది. అయితే ఆ షోలోకి టాలీవుడ్ హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ షోలో శ్రీముఖి నిర్మాత దిల్ రాజు, శిరీష్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే వారిద్దరిని పొగిడే క్రమంలో శ్రీముఖి రామ, లక్ష్మణుల పేర్లను ఉపయోగించింది. షోలో శ్రీముఖి మాట్లాడుతూ.. 'రామ, లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనం విన్నాం.. కానీ సాక్షాత్తూ ఇప్పుడు నా కళ్లముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్ గారు' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదానికి దారితీశాయి.
రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని శ్రీముఖి అనడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే అసలు నీకు రామాయణం తెలుసా? అంటూ ప్రశ్నించారు.
దీంతో శ్రీముఖి ఓ వీడియో రిలీజ్ చేసి నెటిజన్స్ ని క్షమాపణలు కోరింది. ఆ వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ.. 'రీసెంట్ టైమ్స్‌లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్‌లో పొరపాటున రామ, లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే.. నేను దైవ భక్తురాలినే.. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరికీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్న క్షమిస్తారని వేడుకుంటున్నా.. జై శ్రీరామ్' అంటూ శ్రీముఖి తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.