మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టిలపై ఫిర్యాదు చేశారు. వీరు నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు దాఖలు అయ్యింది. న్యాయవాది మామిడాల తిరుమల్ రావు వారిపై కేసు పెట్టారు.  
ఆ ఫిర్యాదులో జై హనుమాన్ సినిమా టీజర్, హనుమంతుడిని కించపరిచే విధంగా ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన టీజర్ లో హనుమంతుని ముఖచిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని కారణంగా భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆ టీజర్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని న్యాయవాది మామిడాల తిరుమల్ రావు చెప్పారు. దీనికి బాధ్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇకపోతే ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ తో పాటు పుష్ప నిర్మాతలుగా ఉన్న వీరందరి పైన కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై కేసు కొట్టివేయాలని హై కోర్ట్ లో నిర్మాతలు పిటిషన్ వేశారు. వారిద్దరి తరుపున థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీంతో హై కోర్టు పుష్ప 2 నిర్మాతలని అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఎట్టకేలకి పుష్ప 2 నిర్మాతలకి ఈ కేసులో ఊరట లభించింది. అలాగే న్యాయ స్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: