మరి నిజానికి దేవర 2 సినిమా స్క్రిప్ట్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉందా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఈసారి కథలు మరింత ఎమోషన్ యాక్షన్స్ సన్నివేశాలతో ఆకట్టుకునేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. అయితే మొదటి భాగం విమర్శలను అధిగమించి ఈసారి రెండో భాగం అంతకుమించి తెరకెక్కించేలా డైరెక్టర్ కొరటాల శివ చాలా కఠినంగా శ్రమిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంతనీల్ తో కొత్త ప్రాజెక్టుని చేయబోతున్నారు.
ఆ తరువాతే దేవర 2 చిత్రాన్ని చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ డేట్లు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందట. కొరటాల శివ ప్రాజెక్టు గురించి ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మొదటి భాగంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నీ తీసుకున్నప్పటికీ పెద్దగా స్కోప్ లేకుండా పోయిందని ఈమె పాత్ర మరింత బలంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతోనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి సీక్వెల్లో కూడా ఈమె స్క్రిప్టులలో మార్పులు చేయాల్సిన పని ఉన్నదట. మొత్తానికి దేవర 2 చిత్ర నిర్మాణానికి సైతం ఎన్టీఆర్ మక్కువ చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.. అయినప్పటికీ కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి రూమర్స్ పైన చిత్ర బృందం ఏవిధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.