సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో సినిమాలో పాట పాడాల్సి ఉండిందట . అది కూడా బ్లాక్ బస్టర్ మూవీలో .. ఆ విషయం ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు "ప్రభాస్". ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా "బాహుబలి". ఈ బాహుబలి సిరీస్ ఇప్పటికే ఎన్నో సార్లు చూసుంటాం..కానీ ఇప్పటికీ టీవీలో వచ్చిన సరే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు .
అయితే ఈ బాహుబలి సినిమాని డైరెక్ట్ చేసింది రాజమౌళి . రాజమౌళి అదేవిధంగా తారక్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది. వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. రాజమౌళి కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలో తన క్యారెక్టర్ చిన్నదైనా కూడా ఒప్పుకున్నాడు. అంత జాన్ జిగిడి దోస్తులు . కాగా బాహుబలి సినిమాలో.. "దీవరా" సాంగ్ ను ఎన్టీఆర్ చేతనే పాటించాలి అని అనుకున్నారట . ఎన్టీఆర్ కూడా అందుకు ఓకే చెప్పారట . స్టూడియోకి కూడా వెళ్లారట . ఒకసారి పాట కూడా చిన్న బిట్ పాడారట . కానీ పాట అనుకున్నంత ఇంపుగా తారక వాయిస్ కు సూట్ అవ్వలేదట . దీంతో ఆ పాటను వేరే ఒక సింగర్ తో పాటించారట. ప్రజెంట్ ఈ వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!