ఆ తర్వాత చిరంజీవిని దగ్గరుండి బెయిల్ ఇప్పించాడు అన్న కామెంట్స్ కూడా ఎక్కువ వినిపించాయి . అయితే ఆ తర్వాత బన్నీనే స్వయంగా వెళ్లి థాంక్స్ చెప్పేసి చిరంజీవి-నాగబాబు ఇంటికి కూడా వెళ్లి వచ్చాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి బిగ్ ప్రాబ్లం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొంటాడా..? పాల్గొనలేడా..? అనే టాక్ హాట్ హాట్ గా మారింది . ప్రతి ఇయర్ సంక్రాంతిని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సెలెబ్రేట్ చేస్తూ ఉంటారు . దానికి సంబంధించి ముందే అందరి హీరోస్ కి ఆ టయానికి కాల్ షీట్స్ ఫీల్ కాకుండా చూసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు పరిస్థితి వేరు .
ఇప్పుడు పరిస్థితి వేరు . ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నాడు . అయితే అల్లు అర్జున్ ని మెగా సంక్రాంతి సెలబ్రేషన్ కి పిలుస్తారా..? పిలవరా..? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ . గతంలో జరిగిన ఇష్యూస్ ఏవి కూడా ఇంకా మారలేదు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ మీట్ అవుతాను అంటుంటే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి . అరెస్టు తరువాత ఏదో పరోక్షంగా బన్నీ పై స్పందించాడు కానీ ఎక్కడ పవన్ - బన్నీ మీట్ అయిన సందర్భాలు లేవు. మెగా సెలబ్రేషన్స్ కి అటెండ్ అయితే వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురుపడాల్సిన సివ్హ్యూవేషన్ వస్తుంది.
ఒకవేళ అలాంటి సిచువేషన్ ఫేస్ చేయడం ఇష్టం లేకపోతే చిరంజీవి అసలు అల్లు అర్జున్ ని సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ చేయడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .దీంతో బన్నీని సంక్రాంతి సెలబ్రేషన్స్ కి పిలుస్తారా..? పిలవరా..? అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది . అయితే అల్లు అర్జున్ ]ఈ క్రమంలోనే తన మేనత్తని మిస్ అయిపోతూ ఉంటాడు అంటూ కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ టైటిల్ ని కూడా బాగా ట్రోలింగ్కి వాడేస్తున్నారు..!