మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చరణ్ కి జోడిగా శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా ... వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. సాయి కుమార్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

భారీ అంచనాల నడుమ 2014 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాతో పాటు 2014 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే సినిమా కూడా విడుదల అయింది. దానితో ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సా ఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఇక 1 నేనొక్కడినే సినిమాకు విడుదల అయిన మొదటి రోజే ఘోరమైన నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా సంక్రాంతికి ఏ మాత్రం ఎఫెక్ట్ చూపలేకపోయింది.

ఇక ఎవడు మూవీ కి విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ రావడంతో ఈ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఆ సంవత్సరం సంక్రాంతి విజేతగా కూడా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలోని చరణ్ నటనకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే శృతి హాసన్ , అమీ జాక్సన్మూవీ లో తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. దర్శకుడిగా వంశీ పైడిపల్లికి కూడా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: