గతంలో నార్త్‌లో ఓ చిన్న ప్రెస్ మీట్ మాత్రం పెట్టారు. పెద్దగా అది ఉపయోగపడలేదు ఇటీవల ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు .. అది అంతంత మాత్రమే నడిచింది .. ఇక అంతకుమించిన ఈవెంట్ ఏమి చేయలేదు .. చెన్నైలో కొద్దో గొప్ప ప్రమోషన్ చేయాల్సిందే కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వెయ్యట్లేదు. ఇక సంక్రాంతి హీరోలు కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు .. రామ్ చరణ్ మీడియాకు ఇంటర్వ్యూలు అసలు ఇవ్వట్లేదు .. బాలకృష్ణ కూడా ఇదే తంతు .. ఒక కామన్ ఇంటర్వ్యూ ఒకటి చేసి చేతులు దులుపుకుంటున్నారు .. డాకు మహారాజ్ కు సంబంధించి రెండు మూడు ప్రెస్ మీట్లు నిర్వహించారు .. అందులో బాలయ్య కనిపించలేదు ..
ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో జరగబోతుంది .. అక్కడికి బాలయ్య ఎలాగూ వస్తారు .. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తవుతాయి .. ఇక వెంకటేష్ పబ్లిసిటీ విషయంలో కాస్త చొరవ చూపిస్తున్నారు .. పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలో మాత్రం కాస్త మొహమాటపడుతున్నాడని తెలుస్తుంది .. మీడియా విస్తృతంగా పెరుగుపోయింది ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అదో తలనొప్పి అందుకే ప్రింట్ మీడియా వరకు టచ్ చేసి వదిలేద్దామని వారు భావిస్తున్నారు. ఇక సాధారణంగా సంక్రాంతి అనగానే వచ్చే సినిమాలు మధ్య పోటాపోటీ పబ్లిసిటీ ఉంటాయి .. రోజుకో ఈవెంట్ జరుగుతూ ఉంటుంది .. అయితే ఈసారి అలాంటి హంగామా ఎక్కడ కనిపించడం లేదు