తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మ లు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్నారు . ఇకపోతే కొంత మంది కి సరైన విజయాలు లేకపోయినా వారు నటించిన సినిమాల్లో తమ అందం తో , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కెరియర్ను చాలా సంవత్సరాల పాటు మంచి దశలో ముందుకు సాగిస్తున్నారు . అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు . ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభించిన కొంత కాలంలోనే కుమారి 21 ఎఫ్ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. ఆ తర్వాత ఈమెకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 

దానితో ఈమె తెలుగు లో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలలో ఏ సినిమా కూడా కుమారి 21 ఎఫ్ , ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా స్థాయి విజయాలను అందుకోలేదు. దానితో ఈమె కెరియర్ గ్రాఫ్ కాస్త పడిపోయిన ఈమెకు అవకాశాలు మాత్రం భారీగానే వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ నటి వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా భారీగా అందాలను కూడా ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇప్పటివరకు దాదాపు 16 సినిమాల్లో నటిస్తే ఈమెకు రెండు విజయాలు మాత్రమే దక్కిన ఈ బ్యూటీ తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: