సింగర్ సుచిత్ర.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న సుచిత్ర ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలపై హీరోయిన్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ధనుష్,షారుక్ ఖాన్ తన మాజీ భర్త కార్తీక్ వంటి ఎంతోమందిపై ఈ సింగర్ వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా సింగర్ సుచిత్ర విశాల్ ని టార్గెట్ చేసింది.గత కొద్ది రోజులుగా విశాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని రీసెంట్గా ఆయన మధగదరాజు సినిమా ప్రమోషన్స్ లో చాలా దారుణ పరిస్థితిలో కనిపించారు. కాళ్లు చేతులు వణుకుతూ కనీసం నిలబడడానికి కూడా ఓపిక లేని స్థితిలో కనిపించారు. దీంతో ఆయన్ని చూసిన చాలా మంది షాక్ అయ్యారు.అయితే ఈయన పరిస్థితిపై అందరూ విచారణ వ్యక్తం చేస్తుంటే సింగర్ సుచిత్ర మాత్రం నాకు విశాల్ కి అలా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది. 

అయితే ఆ వీడియోలో సుచిత్ర ఇలా మాట్లాడింది.. అభిమానులు చాలా చీప్ గా కనిపిస్తున్నారు. మీరందరూ విశాల్ కి అలా జరిగినందుకు ఎందుకు విచారణ వ్యక్తం చేస్తున్నారు. నాకు అర్థం అవ్వడం లేదు.కానీ విశాల్ కు అలా జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది.. ఎందుకంటే విశాల్ వల్ల నాకు జరిగిన ఒక సంఘటన చెబుతాను.నేను నా మాజీ భర్తతో కలిసి ఉన్న సమయంలో ఓ రోజు విశాల్  మా ఇంటికి వైన్ బాటిల్ పట్టుకొని వచ్చి డోర్ కొట్టాడు. దాంతో డోర్ తీసి ఇంట్లో కార్తీక్ లేరు ఆయన వచ్చాక రండి అని చెప్పాను.కానీ విశాల్ మాత్రం కార్తీక్ లేడని తెలిసే నేను వచ్చాను అంటూ మాట్లాడాడు.అంతే కాదు తనని లోపలికి రమ్మని కూడా అడిగాడు. కానీ ఆయన ప్రవర్తన చూసి నేను షాక్ అయ్యి వెంటనే డోర్ వేసి ఆయనతో సంభాషణ కొనసాగించాను.

 ఆరోజే విశాల్ నిజ స్వరూపం ఏంటో నాకు అర్థం అయింది. అంతేకాదు ఆ వైన్ బాటిల్  తీసుకొని గౌతమ్ మీనన్ ఆఫీస్ కి వెళ్ళమని బదులిచ్చాను. దాంతో అక్కడి నుండి విశాల్ వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు విశాల్ ని ఈ పరిస్థితుల్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది.. అంటూ సింగర్ సుచిత్ర సంచలన కామెంట్లు చేసింది.ఇక సుచిత్ర కామెంట్లు చూసి చాలామంది విశాల్ అభిమానులు మండిపడుతుంటే మరి కొంతమందేమో సుచిత్ర మాట్లాడిన దాంట్లో నిజం ఉందా.. విశాల్ అలాంటివారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విశాల్ త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: