టాలీవుడ్, కోలీవుడ్ లో  హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్.. మొదట సవ్యసాచి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.. ఏకంగా తమిళనాడులో ఈమెకు గుడి కట్టే స్టేజ్ కి ఎదిగింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి వారి సరసన నటించేలా పాపులారిటీ సంపాదించుకుంది.


హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించగా రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్గానే ఉంటూ ఈ ముద్దుగుమ్మ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించే వారి కంటే చెడు కోసమే ఎక్కువగా చాలామంది ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. వేధింపులు అనేది సామాన్య ప్రజల నుంచి ఇప్పుడు సెలబ్రిటీల వరకు పాకిపోయింది.


ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఇలాంటి వేధింపులు ఎప్పుడు ఎదురయ్యాయట. దీంతో సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్న వ్యక్తి పైన సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లైంట్ లో ఆ వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది నిధి అగర్వాల్. అలాగే తన కుటుంబాన్ని తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది నిధి అగర్వాల్.


ఆ వ్యక్తి వల్ల తాను మానసికంగా ఒత్తిడికి కూడా గురవుతున్నానని ఆ నిందితుడిని చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ ఈ ఫిర్యాదులో వెల్లడించిందట నిధి అగర్వాల్. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ హీరోయిన్ ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకొని మరి విచారణ చేయబడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: