ఈ మూవీ ట్రైలర్ విడుదల తరువాత ఈ మూవీ పై అంచనాలు బాగా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మాయాజాలం సినిమా ప్రేక్షకులకు కనిపించబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈమధ్య మన టాప్ హీరోలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అన్న ఊహాతో తయారు చేసిన ఒక వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా దర్శకుడు తమన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఒక ఆశక్తికర విషయాన్ని షేర్ చేశాడు. ఈ మూవీకి సంబంధించి విడుదల అయిన మొదటి పాట ‘జరగండి జరగండి’ పాటను మొదట్లో హైదరాబాద్ కు చెందన హనుమాన్ అనే గాయకుడుతో పాడించారట. అయితే ఆతరువాత ఆపాట పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ పాటను దలేర్ మెహేంది పాడినట్టుగా ఏఐ టెక్నాలజీ వాడి రీ క్రియేట్ చేశారు.
ఈ నేపధ్యంలో నిజంగానే ఆపాటను దలేర్ మెహెందీ పాడాడ అన్న సందేహాలు కలగుతాయి. అయితే దీనికి సంబంధించిన అనుమతులు సంగీత దర్శకుడు తమన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఏఆర్ రెహమాన్ అనేక సందర్భాలలో చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఖరీదయిన సెట్లలో ప్రభుదేవా కొరియోగ్రఫీకి రామ్ చరణ్ కియారా అద్వానీలు కలిసి చేసిన ఒక పాటలో చేసిన డాన్స్ హైలెట్ అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..