ప్రతి సంవత్సరం సంక్రాంతి రేస్ కు టాప్ హీరోల సినిమాలు పోటీ పడటం కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కావడంతో ఈసంక్రాంతికి విడుదల అయ్యే అన్ని సినిమాలను ఆసినిమాల టాక్ తో సంబంధం లేకుండా చూడటం తెలుగు ప్రజల అలవాటు. దీనితో తమ భారీ సినిమాలకు ఈ సీజన్ ను ఉపయోగించుకోవాలని ఎందరో టాప్ హీరోలు టాప్ నిర్మాణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.



ప్రతి సంవత్సరం సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలు ఎన్ని విడుదల అవుతున్నప్పటికీ ఆపోటీని లెక్కచేయకుండా తమిళ టాప్ హీరోలు రజనీకాంత్ విజయ్ అజిత్ ల సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదల అవుతూ మన టాప్ హీరోల సినిమాలకు సవాల్ విసరడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. దీనితో సంక్రాంతి సీజన్ సినిమాలకు ధియేటర్ల సమస్య ఏర్పడటం పరిపాటుగా మారింది.



అయితే ఈ సంవత్సరం విడుదల అవుతున్న ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు ఎటువంటి డబ్బింగ్ సినిమాల పోటీ లేకపోవడంతో ఈమూవీల బయ్యర్లు ఆనంద పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం కూడ ఇలాంటి అవకాశం మన తెలుగు సినిమాలకు దక్కింది. 2024 జనవరిలో ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘నా సామిరంగా’ ‘సైంధవ్’ సినిమాలు డబ్బింగ్ సినిమాల పోటీ లేకుండా విడుదల కావడంతో వాటికి అదృష్టం దక్కింది.  



కానీ గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. 2023లో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘కళ్యాణం కమనీయం’ లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా విజయ్ ‘వారసుడు’ అజిత్ ‘తెగింపు’ సినిమాలు విడుదల అవ్వడంతో మన సినిమాలకు అప్పట్లో ధియేటర్ల సమస్య ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రామ్ చరణ్ బాలకృష్ణ చిరంజీవి సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఆసినిమాల టాక్ ఎలా ఉన్నప్పటికీ డబ్బింగ్ సినిమాల పోటీ లేకపోవడంతో ఈమూవీల కలక్షన్స్ కు సమస్యలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: