ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప 2  సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే రిలీజ్ కి ఒకరోజు ముందు ఈ సినిమా ప్రీమియర్ షో సంధ్య థియేటర్ లో వేయగా ఈ షో కి అల్లుఅర్జున్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు.అయితే అల్లుఅర్జున్ రాకతో భారీగా జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.తొక్కిసలాటలో రేవతి అనే మహిళా చనిపోయింది.అలాగే ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.ఈ విషయాన్నీ చాల సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణాలో ప్రీమియర్ షోస్ ,బెన్ఫిట్ షోస్ ,టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి ఇవ్వమని ప్రకటించారు.దీనితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.స్పెషల్ పర్మిషన్స్ లేకపోతే సినిమా రంగం దెబ్బ తింటుందని సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా విన్నవించుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం సినీ రంగం డెవలప్మెంట్ కోసం ఏమి కావాలన్నా చేస్తుంది.అయితే దానికి బదులుగా సినీమా వారు ప్రభుత్వం చేపట్టే   కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని అలాగే తెలంగాణాకి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రాముఖ్యత గురించి వివరించేందుకు సినీ పెద్దలు చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.దీనికి సినిమా వారు అంతా అంగీకరించారు.దీనితో ఆ ఇష్యూ అంతటితో ముగిసింది.ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ టూరిజంపై హీరో నాగార్జున ఓ వీడియో విడుదల చేసారు.పర్యాటకులు తెలంగాణకు రావాలని ఇక్కడ అందమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు.నేను చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను.ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు వున్నాయి.ఇరానీ చాయ్,కరాచీ బిస్కేట్ ,హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మీరంతా రండి తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి అని నాగార్జున పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిన నాగార్జున సినీ సమస్యలు తీర్చేందుకు ముందుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: