ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలలో సందడి చేయనుంది.ఈనేపథ్యంలో శంకర్‌  వరుస ప్రమోషన్‌లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్‌ 2 గతేడాది ప్రేక్షకుల ముందుకువచ్చి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆయన్ని కొందరు విమర్శించారు. తాజా ఇంటర్వ్యూలో వీటిపై శంకర్‌ మాట్లాడారు. విమర్శలను ప్రతిఒక్కరూ జీవితంలో ఏదోఒక సమయంలో ఎదుర్కోవాల్సిందే. వాటినుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా దేనినైనా విమర్శించొచ్చు. అయితే, వాటినుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ముఖ్యం. ఆ విమర్శలను సవాలుగా తీసుకొని తర్వాత ప్రాజెక్ట్‌ను మెరుగ్గా తీయాలి. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ తో నేను బిజీగా ఉన్నాను. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 పనులు ప్రారంభిస్తాను అని చెప్పారు.తాను భవిష్యత్తులో బయోపిక్‌ అంటూ తీస్తే రజనీకాంత్‌ జీవిత చరిత్రనే తెరకెక్కిస్తానని శంకర్‌ స్పష్టంచేశారు. రజనీకాంత్‌ గొప్ప వ్యక్తి. ఈ విషయం ఎంతోమందికి తెలుసు.

నాకు ప్రస్తుతానికి బయోపిక్‌ను తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే రజనీకాంత్‌ బయోపిక్‌నే తీస్తాను అని చెప్పారు. ఈ కామెంట్స్ సినీప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఫ్యూచర్‌లో శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ బయోపిక్‌ వస్తే అది సూపర్‌ హిట్ అవుతుందని వారంతా భావిస్తున్నారు.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలావుండగా శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా దీని ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా హైదరాబాద్‌ సిటీలో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఒక గంటలో రూ.కోటి గ్రాస్‌ కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఇందులో రామ్‌చరణ్‌ మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అవినీతి రాజకీయ నాయకుడికీ, ఓ కలెక్టర్‌కు మధ్య జరిగే యుద్ధమే ఈ చిత్ర కథ అని ట్రైలర్‌ ఆధారంగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: