టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ - అంజలి హీరోయిన్స్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా “ గేమ్ ఛేంజర్ ” . ఎప్పుడో 2021 లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చేసిన సినిమా ఇది. అలాగే వినయ విధేయ రామ సినిమా తర్వాత సోలోగా నటించిన సినిమా ఇది. ఇక పుష్ప 2 హిట్ అవ్వడం .. అందులోనూ ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని మెగా అభిమానుల తో పాటు జనసేన ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు.
ఇక దాదాపు మూడేళ్ల కు పైగా గేమ్ ఛేంజర్ సినిమా కోసం అందరూ ఉత్కంఠ తో వెయిట్ చేస్తున్నారు. ఎంతో కాలం ఎదురు చూపులు తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కి వచ్చేసింది. అయితే ఈ సినిమా బుకింగ్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో పెద్ద సస్పెన్స్ వాతావరణమే నడవగా ఎట్టకేలకు తొలి రోజు 6 షో లతో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు సాధించారు నిర్మాత దిల్ రాజు. ఇక గేమ్ ఛేంజర్ బుకింగ్స్ మిడ్ నైట్ అలా ఓపెన్ అయ్యాయో లేదో హైదరాబాద్ సిటీ లో గేమ్ ఛేంజర్ తన మాస్ ర్యాంపేజ్ చూపించాడు. ఇలా కేవలం ఒక్క గంటలోనే 1 కోటి గ్రాస్ ని కలెక్ట్ చేసి సినిమా రేంజ్ ఏమిటో చాటి చెప్పింది. బాక్సాఫీస్ ను అదరగొట్టింది. ఆల్రెడీ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడిపోయాయి.