టాలీవుడ్ గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “ గేమ్ ఛేంజర్ ”. కోలీవుడ్ సీనియర్ .. మావెరిక్ దర్శకుడు శంకర్ ఎస్ . తెరకెక్కించిన ఈ గేమ్ ఛేంజర్ సినిమా సాలిడ్ పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అయితే సినిమా పై మామూలు గా ఉన్న బజ్ ను ఒక్కసారిగా స్కై రేంజ్ కు తీసుకు వెళ్లి టచ్ చేసింది. ఇక రామ్ చరణ్ నుంచి RRR, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది. ఆ మాటకు వస్తే ఈ రెండు సినిమా లు కూడా మల్టీస్టారర్ సినిమా లుగానే తెరకెక్కాయి. ఎప్పుడో 2019 లో సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్ కంప్లీట్ సోలోగా చేసిన సినిమా ఇదే కావడం విశేషం.
మరో కామన్ పాయింట్ ఏంటంటే వినయ విధేయ రామ సినిమా లోనూ .. ఈ గేమ్ ఛేంజర్ సినిమా లోనూ హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. ఇక ఇపుడు మన తెలుగు హీరోలు హిందీ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న గేమ్ ఛేంజర్ కి కూడా నార్త్ మార్కెట్ లో వసూళ్ల పట్ల ఆసక్తి నెలకొంది. మరి అక్కడ బుక్ మై షో లెక్క ప్రకారం ముంబై లాంటి కొన్ని మేజర్ సిటీస్ తో పాటు పలు సింగిల్ స్క్రీన్ల లో గేమ్ ఛేంజర్ కి డీసెంట్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఏదేమైనా సరైన ప్రమోషన్లు లేకపోయినా కూడా గేమ్ ఛేంజర్ నార్త్ లో పర్వాలేదు అనుకునేలా బుకింగ్స్ నమోదు చేస్తోంది.