కొంతమంది స్టార్ డైరెక్టర్లకు, హీరోలకు ,నటీనటులకు సైతం కొన్ని సెంటిమెంట్లు పలు చిత్రాలలో వర్గౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కొన్ని సెంటిమెంట్లతోనే సక్సెస్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన అభిమానులు, నేటిజన్స్ సైతం సినిమా సూపర్ గా ఉందని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఒక సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.


గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ, అంజలి, సునీల్, బ్రహ్మానందం, ఎస్ జె సూర్య, రాజీవ్ కనకాల తదితర నటీనటులు సైతం నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించారు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను కూడా అద్భుతంగా తెరకెక్కించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని డైలాగ్స్, సన్నివేశాలు, రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. అలాగే అంజలి నటనకు అవార్డు కూడా ఇవ్వచ్చని తెలుపుతున్నారు. ఈ సినిమాతో ఈమె కెరియర్ టర్నింగ్ పాయింట్ అయిందని కూడా చెప్పవచ్చు. ఇందులోని పాటలు కూడా ఒక సరికొత్త ప్రపంచానికి తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయట.


చాలా సినిమాలలో టాలీవుడ్ హీరో అయినా రాజీవ్ కనకాల చనిపోయే పాత్రలో నటిస్తే కచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఒక సెంటిమెంట్ చాలా ఏళ్లుగా ఉన్నది.. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలలో కూడా రుజువు అయ్యింది..గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా ముకుంద అనే పాత్రలో రాజీవ్ కనకాల నటించారట. ఇందులో విభిన్నమైన ఉన్న షేడ్స్ లో కనిపించారు. ఈ పాత్ర చనిపోవుతుందట. రాజీవ్ కనకాల పాత్ర చనిపోతే కచ్చితంగా సినిమా హిట్ టాక్ కచ్చితంగా ఉంటుందని  తెలుగు సినీ ఇండస్ట్రీలో బలంగా నాటుక పోయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేసిందని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: