గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే బెనిఫిట్ షోలు చూసిన వారు క‌లెక్ట‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ లుక్‌.. యాక్టింగ్ అదిరిపోయాయంటున్నారు. ఇక ఫ‌స్టాఫ్ లో ల‌వ్ స్టోరీ కాస్త బోరింగ్ అనిపించినా.. ఇంట‌ర్వెల్ లో ఊహించ‌ని ట్విస్ట్ ఉంటుంద‌ని ... అది సెకండాఫ్ పై మ‌రింత హైప్ పెంచుతుంద‌ని చెపుతున్నారు. ఇక క‌మెడియ‌న్లు కావాల్సినంత మంది సినిమా లో ఉన్నా అస్స‌లు కామెడీ పండ‌లేదంటున్నారు. ఇక థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం .. ఎస్ జె . సూర్య విల‌న్ గా చేసిన న‌ట‌న తో పాటు అంజ‌లి పెర్పామెన్స్ చాలా బాగుంద‌నే చెపుతున్నారు. శంక‌ర్ త‌న పాత మ్యాజిక్ ను కొంత వ‌ర‌కు రిపీట్ చేసినా .. పూర్తి స్థాయి లో అయితే లేద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. ఇక గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్ల‌స్ లు.. మైన‌స్ లు ఎలా ఉన్నాయో చూద్దాం.


ప్ల‌స్ పాయింట్స్ ( + ) :
- రామ్ చరణ్ అద్భుత‌మైన‌ నటన, డ్యాన్స్ తో పాటు థమన్ నేప‌థ్య సంగీతం చాలా సీన్ల ను బాగా ఎలివేట్ చేసింద‌నే టాక్ వ‌చ్చింది. ఇక సీనియ‌ర్ న‌టి  అంజలి పాత్ర సినిమా లో మేజ‌ర్ హైలెట్స్ లో ఒక‌టిగా చెపుతున్నారు. ఆమె అప్ప‌న్న కు జోడీగా వృద్ధురాలి పాత్ర‌లో జీవించింద‌నే చెపుతున్నారు. శ్రీకాంత్ యాక్టింగ్ ... ప్లాస్ బ్యాక్ ఎపిసోడ్ 30 నిమిషాలు సినిమా కు మేజ‌ర్ హైలెట్స్ లోనే ఒక‌టి


మైన‌స్ పాయింట్స్ ( – ) :
గేమ్ ఛేంజ‌ర్ సినిమా గా కొంత వ‌ర‌కు బాగున్నా ... కథలో మరీ కొత్తదనం లేకపోవడం మైన‌స్‌. అలాగే ద‌ర్శ‌కుడు శంక‌ర్ స్క్రీన్ ప్లేలో మిస్ అయిన మ్యాజిక్ కూడా మైన‌స్సే .. ఇక సినిమా లో లాజిక్ లేని కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర పెద్ద‌గా ఇంఫాక్ట్ చూప‌లేదు. కొన్ని రొటీన్ సీన్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: