రామ్ చరణ్ హీరోగా కియారా అద్వాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ .. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన సినిమా బెనిఫిట్ షో తోనే అందర్నీ ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలీలో నటిస్తారు. ఒక పాత్రలో రామ్ చరణ్ కి హీరోయిన్గా కియారా అద్వాని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ కి హీరోయిన్ గా అంజలి నటించారు.ఈ సినిమాలో అంజలి పాత్రకి అవార్డులు రావడం ఖాయం అంటూ సినిమా చూసిన జనాలు రివ్యూలు ఇస్తున్నారు. ఎందుకంటే అంజలి యాక్టింగ్ అంత బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చూసిన జనాలు ఇప్పటినుండి రాజమౌళి సెంటిమెంట్ కి బ్రేక్ పడ్డట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి రాజమౌళి సెంటిమెంట్ ఏంటి అనేది చూస్తే.. రాజమౌళి డైరెక్షన్లో హీరోలుగా చేసే ఏ హీరోలైనా సరే ఆ సినిమా తర్వాత మరో డైరెక్టర్ తో చేసే సినిమాలు కచ్చితంగా ప్లాఫ్ అవుతాయి. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమా తర్వాత ప్రతి హీరోలు ఆ తర్వాత నటించే సినిమాలకు ఫ్లాప్ సెంటిమెంట్ గత కొద్ది కాలంగా కొనసాగుతోంది.

 ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్లో నటించిన ఎన్టీఆర్,రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలకు ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వచ్చి పడింది.ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాల తర్వాత ఈ హీరోలు నటించిన ఏ సినిమా కూడా అనుకున్నంత మేర హిట్టు కాలేదు. దాంతో రాజమౌళి సినిమా తర్వాత చేసే ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉండిపోయింది.కానీ ఈ సెంటిమెంట్ ని మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లు బ్రేక్ చేసినట్టు అయింది.ఎందుకంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా హిట్ కొట్టింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాకపోయినప్పటికి బ్రేక్ ఈవెన్ టార్గెట్  అయితే పూర్తి చేసుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాంచరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్..ఈ మూవీ కూడా బెనిఫిట్ షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్ కి గేమ్ చేంజర్ బ్రేక్ ఇచ్చింది అంటూ చాలామంది మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఇక ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలో నటించి ఆ తర్వాత సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా గేమ్ చేంజర్ మూవీతో పోయినట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇప్పటికే రెండు మూడుసార్లు రాంచరణ్, ఎన్టీఆర్లు రాజమౌళి డైరెక్షన్లో చేశారు. కానీ ఆ తర్వాత వీళ్ళు చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ మొదటిసారి ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఈ ఇద్దరు హీరోలు చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ఇక ఇండస్ట్రీలో పోయినట్టే అని పోస్టులు పెడుతున్నారు చాలామంది సినిమా చూసినా అభిమానులు.అయితే గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో ఇప్పటికే పూర్తయింది.కాబట్టి సెకండాఫ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ బాలేదు అనే రివ్యూలు కొంతమంది ఇస్తున్నారు. ఇక ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా సినిమా మాత్రం యావరేజ్ టాక్ ఐనా తెచ్చుకుంటుంది. ఫ్లాప్ అయితే అస్సలు కాదు. అలాగే రాంచరణ్ ఇప్పటివరకు  నటించిన మూడో సినిమా ఆరెంజ్, ఆరో సినిమా తుఫాన్, తొమ్మిదో సినిమా బ్రూస్ లీ, 12వ సినిమా వినయ విధేయ రామ వంటి మూవీస్ భారీ డిజాస్టర్స్..కానీ 15వ సినిమాగా వచ్చిన గేమ్ చేంజర్ మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసింది.ఎందుకంటే రాంచరణ్ నటించిన రెండు సినిమాలు తర్వాత మూడో సినిమా ఖచ్చితంగా ఫ్లాఫ్ అవుతుంది. కానీ ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే గేమ్ చేంజెర్ ప్లాఫ్ కావాలి.కానీ ఆ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది.ఎందుకంటే రాంచరణ్ 15వ సినిమా గేమ్ ఛేంజర్ హిట్ టాక్ తెచ్చుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: