ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ సోలో హీరోగా నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుండే స్పెషల్‌ షోస్ పడ్డాయి.సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా మూడు వందల కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు అందులో ముఖ్యంగా పాటల కోసమే దాదాపు వంద కోట్లుదాక ఖర్చు చేసినట్లు సమాచారం.అలాగే హీరో  రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు అరవై అయిదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.ఆర్ఆర్ఆర్ సినిమాతో పోల్చుకుంటే ఇది తక్కువే అని చెప్పాలి. చరణ్ తో పాటు ఇందులో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, కియారా అద్వానీ, అంజలి వంటి భారీ తారాగణం కూడా భాగమైంది. ఒక పొలిటిషన్ కి, ప్రభుత్వ ఉద్యోగికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ.

అయితే కధ పరంగా ఈ సినిమా అనేది రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఫస్ట్ హాఫ్ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో శంకర్ తన స్టైల్ లో అవినీతి అధికారులు, వ్యాపారవేత్తల గురించి చూపించారు.ఫస్ట్ హాఫ్ లో రాంచరణ్, ఎస్ జె సూర్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంజలి పాత్ర పరిచయం కాగానే ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది. పెళ్లి బట్టలు గెటప్ లో పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండ్ హాఫ్ పై అంచానాలు పెంచేలా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబౌ యావరేజ్ స్టఫ్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ కాలేదు.ఇక సెకండ్ హాఫ్ లో తొలి ఇరవై నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.ఇరవై నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తెరకెక్కించిన విధానం అద్భుతం.సినిమా మొత్తాన్ని రాంచరణ్ తన భుజాలపై మోయగా ఎస్ జె సూర్య సహకారం అందించారు. తమన్ బిజియం కూడా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: