అయితే ఇందులో కీలకమైన పాత్ర అన్నట్లుగా సినిమా విడుదలకు ముందు నుంచే ఒకరు పేరు వినిపించింది.ఆ హీరోయిన్ ఎవరో కాదు అంజలి.. ఈమె నటన చూసిన తర్వాత ఈమెకు అవార్డులు వచ్చిన ఆశ్చర్యపోలేదుగా అంటూ పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. కొన్ని పాత్రలు కొంతమందికే పుడతాయేమో అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలా గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా అంజలి పోషించిన పార్వతి అనే పాత్ర ఈమె కెరియర్లో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉందట.
ఇందులో అంజలి వయసు మళ్ళిన పాత్రలో కాకుండా, మానసిక స్థితి సరిగ్గా లేని పాత్రలో కూడా శంకర్ అద్భుతంగా చూపించారట. ఈ పాత్రకు ఊహించని క్లైమాక్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యిందని సినిమా చూసిన ఆడియన్స్ నేటీజన్స్ సైతం తెలియజేస్తున్నారు.. మొత్తానికి సినిమాకి టర్నింగ్ పాయింట్ గతంలో నుంచి అంజలి ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అన్నట్టుగానే గేమ్ ఛేంజర్ సినిమాకి ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. మరి ఏ మేరకు ఈమె నటనకు అవార్డులు వస్తాయో చూడాలి మరి. గత కొంతకాలంగా హీరోయిన్ అంజలి కూడా సరైన పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించేందుకు ఒక ప్లాట్ ఫాంగా మారిందని అభిమానుల సైతం తెలుపుతున్నారు.