రామ్ చరణ్ హీరోగా చేసిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అప్పటి నుండి ఈయన చేసే సినిమాలపై ప్రేక్షకులకు మరింత దృష్టి పడింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ని అందరూ ఆ రేంజ్ లోనే చూస్తారు.ఇక ఈయన చేసే సినిమాలు కూడా ఆ లెవెల్ లోనే ఉండాలి అని గుర్తుపెట్టుకొని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  గేమ్ ఛేంజర్ సినిమాని స్టార్ట్ చేశారు. అలా ఎన్నోఅడ్డంకుల మధ్య ఎన్నో వాయిదాలు వేసుకుంటూ ఈ సినిమా చివరికి సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదలైంది. ఇక ఈ సినిమా ఒకరోజు ముందే బెనిఫిట్ షో పడిపోయింది.ఇక సినిమా చూసిన ప్రేక్షకులు అయితే సంతోషంతో నిండిపోయిన మొహాలతో బయటికి వస్తున్నారు. అలా సినిమా చూసి రివ్యూ ఇచ్చే జనాలు ఫస్ట్ ఆఫ్ బాలేదు. సెకండ్ హాఫ్ బాగుంది. కామెడీ బాగా పండలేదు. లవ్ స్టోరీ కూడా అంత బాగాలేదు అంటూ రివ్యూ లు ఇచ్చినప్పటికీ శంకర్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగా పెట్టాడు అంటూ పొగుడుతున్నారు. 

అయితే భారీ బడ్జెట్ తో విడుదలయ్యే ఏ సినిమా అయినా సరే సినిమా విడుదలయ్యాక అందులో ఉన్న కొన్ని డైలాగులు,పాత్రలు కొంతమందిని పోలి ఉన్నాయి అంటూ మాట్లాడుకుంటారు. అలా గేమ్ చేంజర్ మూవీ చూసిన కొంతమంది జనాలు గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ అటు చంద్రబాబు రుణం ఇటు చిరంజీవి రుణం ఇద్దరిదీ కలిపి ఒకేసారి తీర్చేసుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ చంద్రబాబు చిరంజీవికి సంబంధించి ఎలాంటి సన్నివేశాలు చూపించారు ఎలాంటి డైలాగులు చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి పొలిటికల్ పార్టీని తలపించేలా కొన్ని డైలాగ్ లు చెప్పాడు. అయితే చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత పూర్తిగా  సినిమాలకే అంకితమయ్యారు.

మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు అంటూ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ తండ్రి పెట్టిన పార్టీని గుర్తు చేసేలా ఈ సినిమాలో ఓ రాజకీయ పార్టీ పేరులో ప్రజా అని ఉంటుంది. దీంతో ఆ రాజకీయ పార్టీ పేరుని చూసి చాలామంది నెటిజన్స్ రామ్ చరణ్ తన తండ్రి రాజకీయ పార్టీని ఈ సినిమాలో గుర్తు చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అలాగే రాంచరణ్ అప్పన్న పాత్రలో నటించిన సమయంలో ఎక్కువగా సైకిల్ తొక్కే సన్నివేశాలు ఉంటాయి.అలా సైకిల్ తొక్కుతూ చంద్రబాబును కూడా గుర్తు చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాంచరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ టిడిపి కూటమిలో భాగమయ్యారు. అలాగే కూటమిలో భాగంగా ఉన్న చంద్రబాబుకి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున రామ్ చరణ్ ఇలా తన సినిమాలో సైకిల్ ని వాడుకొని చంద్రబాబు రుణం తీర్చుకున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి తన సినిమాలో చిరంజీవి, చంద్రబాబులను రామ్ చరణ్ బాగానే కవర్ చేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: