2025 సంవత్సరంలో రిలీజైన తొలి పెద్ద సినిమా ఏదనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ మూవీ పేరు జవాబుగా వినిపిస్తుంది. చరణ్ మూవీ రిలీజ్ తో 2025 సంవత్సరానికి శుభారంభం దక్కింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ నుంచి హిట్ టాక్ వస్తోంది. అయితే సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కావడం గేమ్ ఛేంజర్ సినిమాకు ప్లస్ కానుంది. బోరింగ్ సన్నివేశాలు లేకపోవడంతో పాటు మాస్ కు నచ్చేలా ఈ సినిమా ఉంది.
 
దిల్ రాజు, శంకర్ నక్క తోక తొక్కారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల టార్గెట్ తో విడుదలైన గేమ్ ఛేంజర్ పండగ సెలవులను క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. శంకర్ ఈ సినిమాతో తనతో టాలెంట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే మిగతా సినిమాలకు ఎలాంటి టాక్ వస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
 
రామ్ చరణ్ శంకర్ కాంబో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి 1 నుంచి షోలు ప్రదర్శితమయ్యాయి. టైర్2, టైర్3 ఏరియాలలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం గేమ్ ఛేంజర్ సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి.
 
గేమ్ ఛేంజర్ మూవీ బుకింగ్స్ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. టికెట్ రేట్లు నార్మల్ గా ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. భారీ టికెట్ రేట్లు సినిమాపై ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా గేమ్ ఛేంజర్ గా నిలిచే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: