గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్నగా విలువలు, సిద్ధాంతాలను నమ్మే వ్యక్తి పాత్రలో చరణ్ నటించారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించడం గమనార్హం. రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఉన్న ఒక లోపం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.
 
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఎలాంటి లోపం ఉందో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ పాత్రకు కూడా అలాంటి లోపం ఉంది. కొంతమంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చడం లేదనే పూర్తిస్థాయి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ పవర్స్ గురించి చూపించే ప్రయత్నం చేసిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఎస్జే సూర్య ఈ సినిమాకు ప్లస్ అయ్యారని చెప్పవచ్చు.
 
గేమ్ ఛేంజర్ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సినిమాలో నానా హైరానా సాంగ్ ఉండి ఉంటే బాగుండేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నానా హైరానా సాంగ్ ను థియేటర్లలో యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.
 
ఈ సాంగ్ కోసమే సినిమాను చూడాలని అనుకునే వాళ్లు కొన్నిరోజులు ఆగి థియేటర్లలో చూస్తే మంచిది. టామ్ అండ్ జెర్రీ గేమ్ లా సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. తమిళనాడులో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. గేమ్ ఛేంజర్ నార్త్ కలెక్షన్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. సాంగ్స్ కు సంబంధించి ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ తన యాక్టింగ్ తో గ్రేట్ అనిపించుకున్నారు. రంగస్థలం సినిమాను మరిపించే రేంజ్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించడం గమనార్హం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: