దీంతో గేమ్ ఛేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి చర్చ జరిగింది. అలాగే సినిమా టికెట్ల విక్రయం గురించి కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్లు సేల్స్ విషయంలో కూడా ఆశించిన స్థాయిలో జరగలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఒక సెన్సేషనల్ అయినప్పటికీ కూడా ఈ సినిమా స్పందన మాత్రం అంచనాలను అందుకోలేకపోతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురు కావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ శంకరే అంటూ చాలామంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఈమధ్య చాలాకాలంగా డైరెక్టర్ శంకర్ సినిమాల పైన ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందనే విధంగా టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్ ఉండేది.. కానీ భారతీయుడు 2 సినిమా గోరంగా డిజాస్టర్ కావడంతో ఈయన క్రేజ్ భారీగా తగ్గిపోయింది.గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక్కరోజులోనే 5 లక్షల పైగా టికెట్లు విక్రయించినట్లు టాక్ వినిపిస్తోంది.. ఇలా బుకింగ్ మొత్తం విలువ రూ 15 కోట్ల రూపాయలు గ్రాస్ ఉన్నట్లు సమాచారం.ఇప్పటివరకు 8000షోలను అయితే ప్రదర్శించినట్లు సమాచారం.
రాష్ట్రాల వారీగా చేసుకుంటే గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే ఏపీలో 9 కోట్ల గ్రాస్ టికెట్లు అమ్ముడుపోయాయట. ఆ తర్వాత తెలంగాణలో 3.9కోట్లకు పైగా కర్ణాటకలో కోటి రూపాయలు తమిళనాడులో కోటి రూపాయలు మేరకు అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్స్ అమ్ముడుపోయాయట. తమిళనాడులో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన శంకర్ సినిమా పరిస్థితి కూడా అక్కడ అలా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.