గేమ్ ఛేంజర్ సినిమాలో పొలిటికల్ సీన్స్ ఉంటాయని ఆ సీన్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని గత కొంతకాలంగా దిల్ రాజు చెబుతూ వస్తున్నారు. దిల్ రాజు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటనే ప్రశ్నకు గేమ్ ఛేంజర్ సినిమా చూస్తే జవాబు తెలుస్తోంది. మ్ ఛేంజర్ లో హైడ్రా, జీరో బడ్జెట్ పాలిటిక్స్ సన్నివేశాలకు బాగానే ప్రాధాన్యత దక్కడం గమనార్హం.
 
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోని స్టార్టింగ్ సన్నివేశాల్లోనే రామ్ నందన్ పాత్ర ఒక బిల్డింగ్ ను ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించలేదని కూల్చేస్తుంది. ఆ సమయంలో నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూల్చేశారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరుకుతుంది. తెలంగాణలో హైడ్రా గురించి ఈ విధంగా ప్రస్తావించడం గమనార్హం.
 
మరోవైపు జనసేన జీరో బడ్జెట్ పాలిటిక్స్ డైలాగ్స్ సినిమాలో ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో రెండు రాష్ట్రాలను కవర్ చేసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ ఆశయాలను, లక్ష్యాలను ప్రతిబింబించే సన్నివేశాలు మాత్రం సినిమాలో ఎక్కువగానే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ కు మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కమర్షియల్ గా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాల్సి ఉంది.
 
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు మాత్రం జీ తెలుగు, జీ సినిమాలు సొంతమయ్యాయి. నానా హైరానా సాంగ్ యాడ్ అయితే ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా బాగుందని చెబుతున్నారు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ శంకర్ అభిమానులకు సైతం ఎంతగానో నచ్చుతుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: