ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . "గేమ్ చేంజర్" సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలుసు . కాగా  సినిమా చూసిన జనాలు రకరకాల రివ్యూలు ఇస్తూ వస్తున్నారు.  అంతేకాదు సినిమాకి కర్త - కర్మ-క్రియ అంతా కూడా రామ్ చరణ్ అంటూ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కీయరా అద్వాని - అంజలి పాత్రలల్లో అంజలి పాత్ర హైలెట్ గా నిలిచింది అంటున్నారు . అంజలికి ఈ సినిమా ద్వారా మంచి అవకాశాలు కూడా వస్తాయి అంటున్నారు ఫాన్స్ .


కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా మారింది . శంకర్ డైరెక్షన్ బాగా ఆకట్టుకుంటుంది . అయితే కీయరా అద్వానీ పాత్రపై కొంతమంది నెగిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ చెంజర్ సినిమా రిలీజ్ కి ముందు వరకు అంజలి ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు.. పాల్గొనలేదు.. ఆమెకి సంబంధించిన ఎక్కువ అప్డేట్స్ కూడా ఏది రిలీజ్ కాలేదు. కానీ సైలెంట్ గా అంజలి క్యారెక్టర్ సూపర్ గా డిజైన్ చేశాడు శంకర్ అంటూ సినిమా రిలీజ్ అయ్యాక అర్థం అయిపోయింది .



అంతేకాదు ఇప్పుడు గేమ్ చేంజర్  సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాంచరణ్ క్యారెక్టర్ ని ఎంత పొగిడేస్తున్నారో.. ఆ తర్వాత అంజలి క్యారెక్టర్ ని అంతగా పోగిడేస్తున్నారు . అంజలి కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు . తెలుగు అమ్మాయే అయిన తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది అంజలి. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో నటించి తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంది. చూద్దాం మరి మొదటి రోజుకి ఈ మెగా హీరో గేమ్ చేంజర్  సినిమా కి ఏ విధమైనటువంటి కలెక్షన్స్ వస్తాయో..???

మరింత సమాచారం తెలుసుకోండి: